Skip to main content

Posts

మహేష్‌ మూవీ నుంచి జగపతి బాబు అవుట్‌?

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఎఫ్‌ 2తో సూపర్‌ హిట్ అందుకున్న అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సీనియర్‌ నటుడు జగపతి బాబు తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంపై చిత్రయూనిట్ స్పందించకపోయినా జగపతి బాబుకు బదులు ప్రకాష్‌రాజ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.షూటింగ్‌లో పాల్గొనేందుకు కాశ్మీర్‌ వెళ్లిన జగపతి బాబు తన పాత్రను ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.Sarileru Neekevvaru, Mahesh Babu, Anil Ravipudi, Jagapathi Babu

తమన్నా ప్లేస్‌లో అవికా గోర్‌!

బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్‌ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు.ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు.అయితే ఆ సినిమా రిజల్ట్‌ బెడసి కొట్టింది. అందుకే తదుపరి సినిమాకు లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు.
ఇటీవల తన తమ్ముడు అశ్విన్‌ హీరోగా రాజుగారి గది 3 చిత్రాన్ని ప్రారంభించాడు ఓంకార్‌.హారర్‌ జానర్‌లో తెరకెక్కనున్న  ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు.కానీ ఓ బాలీవుడ్‌ సినిమా కోసం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.దీంతో చేసేదేమి లేక మరో హీరోయిన్‌తో సినిమాను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే తమన్నా లాంటి గ్లామరస్‌ స్టార్‌ను తీసుకోవాలనుకున్న ప్లేస్‌లో ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేం అవికా గోర్‌ను తీసుకున్నారట.అవికా టాలీవుడ్‌ను వదిలేసి చాలా కాలం అవుతుంది.ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించినా అది అతిథి పాత్రే.మరి ఈ సమయంలో అవికా రాజుగారి గది 3కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.Omkar, Tamannah, Avika Gor, Raju Gari Gadhi 3.

మరో మహిళతో ముద్దు సీన్... సమర్దించుకున్న అమలా పాల్!

హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ఆడై (తెలుగులో 'ఆమె') చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో అమలా పాల్ పూర్తి నగ్నంగా నటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.ఈ సినిమా ద్వారా ఎలాంటి కథ చెప్పబోతున్నారు? ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా అమలా పాల్ నటించడానికి కథలో అంతబలమైన కారణం ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది.దీంతో పాటు ట్రైలర్లో అమలా పాల్, విజె రమ్య మధ్య ఉన్న ముద్దు సీన్ కూడా హాట్ టాపిక్ అయింది.అమలా పాల్, విజె రమ్య ముద్దు ఎఫెక్టుతో ఈ చిత్రం లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ కాన్సెప్టుతో నడుస్తుందనే రూమర్లు కూడా తెరపైకి వచ్చాయి.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. సినిమాలో సబ్జెక్ట్ అది కాదు అని స్పష్టం చేశారు. ఈ మూవీ ద్వారా ఒక విభిన్నమైన కథను చెప్పబోతున్నట్లు తెలిపారు.ఆమెను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి అంటున్న అమలా పాల్ అయితే రమ్యతో ముద్దు సీన్ గురించి అడిగిన ప్రశ్నకు అమలా పాల్ రియాక్ట్ అవుతూ... ‘ఒక మహిళ మరో మహిళను ముద్దాడితే తప్పేంటి? అది…

లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో కూతురు.. జనాలు చూడడంతో పరుగులు

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది.ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసిన ఈ అమ్మడు భారీ విజయాలను సొంతం చేసుకుంది.తొలి సినిమా 'కేదార్‌నాథ్'తోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు అందుకున్న ఈ అమ్మడు.. తర్వాత 'టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన 'సింబా'లో నటించి మెప్పించింది.తాజాగా తన వ్యవహార శైలితో బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది ఈ స్టార్ హీరో కూతురు.
సారా అలీ ఖాన్.. కార్తీక్ ఆర్యన్ అనే హీరోతో డేటింగ్‌లో ఉంది. వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు.ఈ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు.. బయట కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్లు ఈ మధ్య పలుమార్లు కెమెరాల కంటికి కూడా చిక్కడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ వార్త బీ టౌన్‌లో హాట్ టాపిక్సారా అలీ ఖాన్.. కార్తీక్‌తో డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆమె కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోంది.
సారా నాలుగు రోజుల క్రితం కార్తీక్‌ను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసింది.అదే సమయంలో మరో కారులో ఆమె సోదరుడు, తల్లి కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చారు.దీంతో కెమెరామె…

జ్యోతిక పై పోలీస్ కేసు.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కీర్తించబడుతూ పలు విజయవంతమైన సినిమాలు చేస్తున్న జ్యోతికపై పోలీస్ కేసు నమోదైంది.ఆమె నటించిన ఓ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి.జ్యోతిక చేసిన క్యారెక్టర్ తమ మనోభావాలను దెబ్బ తీసిందంటూ కొందరు ఉపాధ్యాయులు చెన్నైలోని పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. 
వివరాల్లోకి పోతే..ఇటీవలే విడుదలైన రాక్షసి సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది.జ్యోతిక చేసిన ఈ పాత్రకు మంచి స్పందనే వచ్చినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం తీవ్రంగా వ్యతిరేఖించారు.ఈ మేరకు వారంతా కలిసి చెన్నై పోలీసులను ఆశ్రయించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల అసమర్థతను, నిర్లక్ష్యాన్ని ఈ సినిమాలో ఎత్తి చూపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పాత్రలో నటించిన జ్యోతిక, ఇతర ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పకుండా సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.అలాగే విద్యార్థులు సిగరెట్లు, మందు తాగుతూ గొడవలు పడటం లాంటి సన్నివేశాలు చిత్రీకరించారు.
ప్రభుత్వం నుంచి అత్యధిక వేతనాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు.. విద్యార్థుల భవిష్యత్, పా…

బోయపాటి సినిమాలో హీరో ఎవరు?

‘వినయ విధేయరామ’ ప్లాప్ ఎఫెక్ట్ బోయపాటి పై బాగానే పడింది.నందమూరి బాలకృష్ణతో అనుకున్న సినిమా కూడా పోస్ట్ ఫోన్ అయి.. చివరికీ క్యాన్సల్ అయింది.దాంతో ఎప్పుడూ వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉండే బోయపాటి గత ఐదు నెలల నుండీ ఖాళీగా ఉన్నాడు.ఈ క్రమంలో బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడు ఉంటుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదని ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసగా వార్తలు వచ్చాయి.మొత్తానికి ఆ వార్తలకు తెర దించుతూ.. ‘త్వరలోనే తన బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించాడు.ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా ఇప్పటికి క్లారిటీ వచ్చింది, అయితే బోయపాటి – అల్లు అరవింద్ కాంబినేషన్ లో వచ్చే మూవీలో ఎవరు హీరోగా నటిస్తారు..? మెగా హీరోల్లో ఎవరో ఒకళ్ళు హీరోగా నటిస్తారా..? లేదా వేరే హీరో ఎవరైనా నటిస్తారా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.మరి ఇంతకీ బోయపాటి – బాలయ్య సినిమా ఉంటుందా ? లేదా అనే విషయం కూడా తేలాల్సి ఉంది.సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పట్లో సినిమా లేకపోయినా వచ్చే ఏడాది అయినా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందట.

Boyapati Srinu, Allu Aravind

సాయి పల్లవి 'కామ్రేడ్‌'కి నో చెప్పిందా!

తొలి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను ‘ఫిదా’ చేసిన బ్యూటీ సాయి పల్లవి.తెలుగుతో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ ఫుల్ ఫాంతో దూసుకుపోతున్న ఈ భామ ఓ క్రేజీ హీరో సినిమాలో అవకాశం వచ్చినా నో చెప్పారట.సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌.ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా సాయి పల్లవి సంప్రదించారట.అయితే ముద్దు సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను సాయి పల్లవి తిరస్కరించినట్టుగా ప్రచారం జరుగుతోంది.కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న ఈ భామ ఎక్స్‌పోజింగ్‌, ఇంటిమేట్‌ సీన్స్‌కు దూరంగా ఉంటున్నారు.అందుకే డియర్‌ కామ్రేడ్‌ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా వదులుకున్నట్టుగా తెలుస్తోంది.విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న డియర్‌ కామ్రేడ్ ఈ నెల 26 ప్రేక్షకుల ముందుకు రానుంది.మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినమాతో భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Dear Comrade, Vijay Deverakonda, Rashmika Mandanna, Sai Pallavi