తమన్నా ప్లేస్‌లో అవికా గోర్‌!




  • బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్‌ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు.
  • ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు.
  • అయితే ఆ సినిమా రిజల్ట్‌ బెడసి కొట్టింది. అందుకే తదుపరి సినిమాకు లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు.

  • ఇటీవల తన తమ్ముడు అశ్విన్‌ హీరోగా రాజుగారి గది 3 చిత్రాన్ని ప్రారంభించాడు ఓంకార్‌.
  • హారర్‌ జానర్‌లో తెరకెక్కనున్న  ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు.
  • కానీ ఓ బాలీవుడ్‌ సినిమా కోసం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.
  • దీంతో చేసేదేమి లేక మరో హీరోయిన్‌తో సినిమాను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు.

  • అయితే తమన్నా లాంటి గ్లామరస్‌ స్టార్‌ను తీసుకోవాలనుకున్న ప్లేస్‌లో ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేం అవికా గోర్‌ను తీసుకున్నారట.
  • అవికా టాలీవుడ్‌ను వదిలేసి చాలా కాలం అవుతుంది.
  • ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించినా అది అతిథి పాత్రే.
  • మరి ఈ సమయంలో అవికా రాజుగారి గది 3కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Comments

Popular posts from this blog

మహేష్‌ మూవీ నుంచి జగపతి బాబు అవుట్‌?

మరో మహిళతో ముద్దు సీన్... సమర్దించుకున్న అమలా పాల్!