నాని సినిమాకి నిర్మాతగా రానా...
 • కెరీర్ మంచి ఊపుమీదున్న దశలో 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి చిత్రాలతో వరుస పరాజయాలను చవి చూశాడు నేచురల్ స్టార్ నాని.
 • ఈ సినిమాల తర్వాత అతడు నటించిన చిత్రం 'జెర్సీ'. క్రికెట్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది.
 • ఇందులో నాని నటనకు, పలికించిన హావభావాలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.
 • తెలుగులో ఘన విజయం సాధించిన ‘జెర్సీ'ని రీమేక్ చేస్తామంటూ ఇతర భాషలకు చెందిన చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ముందుకు వచ్చారు.
 • క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీనిపై అన్ని ఇండస్ట్రీలు కన్నేశాయి.
 • అలాగే, మనదేశంలో క్రికెట్‌కు ఎంతో మంది అభిమానులు ఉండడంతో ఈ సినిమా ఏ భాషలో తీసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో వారంతా చిత్ర యూనిట్‌తో సంప్రదింపులు సైతం జరిపారు.
 • ఇద్దరు బడా ప్రొడ్యూసర్లు కలిసి హిందీలోకి.. ‘జెర్సీ'ని హిందీలోకి తీసుకెళ్లేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు.
 • హిందీలోనూ గౌతమ్ తిన్ననూరే తెరకెక్కించనున్నారని తెలిసింది. అలాగే, ఈ సినిమాకు వరుణ్ ధావన్, షాహీద్ కపూర్‌లలో ఒకరిని తీసుకోవాలని ఈ ఇద్దరు నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
 • ఒకవైపు ‘జెర్సీ'ని హిందీలో రీమేక్ చేయడానికి ఇద్దరు బడా ప్రొడ్యూసర్ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే సినిమాను తమిళంలోనూ తీయాలని సురేష్ ప్రొడక్షన్స్ భావిస్తోందట.
 • ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా మారబోతున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది.
 • ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్‌.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం. విష్ణు స్వతహాగా క్రికెట్ ప్లేయర్ కావడంతోనే రానా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
 • నాని కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘నిన్ను కోరి'ని కూడా తమిళంలో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు.
 • ఈ సినిమా తమిళ దర్శకుడు కన్నన్ తీసుకున్నారు. ఇందులో నాని పాత్రను అధర్వ పోషిస్తుండగా.. నివేదా థామస్‌లా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఆది పాత్ర చేయబోయే వారి కోసం ప్రస్తుతం చిత్ర బృందం అన్వేషిస్తోంది.


Rana Daggubati, Nani, Jersey

Comments

Popular posts from this blog

మహేష్‌ మూవీ నుంచి జగపతి బాబు అవుట్‌?

తమన్నా ప్లేస్‌లో అవికా గోర్‌!

మరో మహిళతో ముద్దు సీన్... సమర్దించుకున్న అమలా పాల్!