రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. ఇకపై ఆమె..
 • విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం.
 • 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. 'అర్జున్ రెడ్డి'లో మాత్రం ఎంతో వైలెంట్‌గా కనిపించాడు.
 • టాలీవుడ్‌లో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
 • అప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్న సరిహద్దులను ఈ సినిమా చెరిపివేసింది.
 • దీంతో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు.
 • ఎంతో ఫాలోయింగ్‌ను పెంచుకున్న ఈ కుర్ర హీరో.. త్వరలోనే రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్నాడట.
 • ‘అర్జున్ రెడ్డి'తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ.. వ్యాపార రంగంలోకీ అడుగు పెట్టాడు.
 • తనను అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘రౌడీ' పేరిటే.. మెన్స్‌వేర్‌ స్టోర్స్‌ను స్టార్ట్ చేశాడు.
 • ఇప్పటికే హైదరాబాద్ సహా చాలా చోట్ల విజయ్ తన స్టాల్స్‌ను ఏర్పాటు చేశాడు. మరికొన్నింటిని కూడా మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు .
 • తన బ్రాండ్ దుస్తులకు ప్రమోషన్ చేసే విషయంలోనూ విజయ్ దేవరకొండ వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు.
 • ప్రెస్ మీట్లు, సినిమా ఫంక్షన్లు ఇలా.. బయట అతడు ఎక్కడికి వెళ్లాలన్నా రౌడీ బ్రాండ్ దుస్తులనే వేసుకుని వెళ్తుంటాడు.
 • అంతేకాదు, ఈ ప్రమోషన్ కోసం అతడు గతంలో కొన్ని ప్రత్యేకమైన షోలు కూడా ఏర్పాటు చేశాడు.
 • తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమేజాన్‌తో విజయ్ దేవరకొండ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
 • తన రౌడీ బ్రాండ్ దుస్తులను సదరు సంస్థలో అమ్మకాలు జరిపేటట్లు విజయ్ డీల్ చేసుకున్నాడు.
 • ఇక, అప్పటి నుంచి రౌడీ బ్రాండ్ మెన్స్‌వేర్ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
 • ఇప్పటి వరకు మెన్స్‌వేర్‌కే పరిమితమైన విజయ్.. త్వరలోనే లేడీస్‌వేర్‌ను సైతం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
 • ఇందుకోసం అతడు తన రియల్ పార్ట్‌నర్ రష్మిక మందన్నాను వ్యాపార భాగస్వామిగా చేసుకోబోతున్నాడని సమాచారం.
 • ఈ మేరకు వీళ్లిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
 • విజయ్ దేవరకొండ - రష్మిక తాజాగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'.
 • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
 • ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది.
 • దీంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి.
 • ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Vijay Deverakonda, Rashmika MandannaRowdy Brand

Comments

Popular posts from this blog

మహేష్‌ మూవీ నుంచి జగపతి బాబు అవుట్‌?

తమన్నా ప్లేస్‌లో అవికా గోర్‌!

మరో మహిళతో ముద్దు సీన్... సమర్దించుకున్న అమలా పాల్!