మరో మహిళతో ముద్దు సీన్... సమర్దించుకున్న అమలా పాల్!
 • హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ఆడై (తెలుగులో 'ఆమె') చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
 • రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో అమలా పాల్ పూర్తి నగ్నంగా నటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
 • ఈ సినిమా ద్వారా ఎలాంటి కథ చెప్పబోతున్నారు? ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా అమలా పాల్ నటించడానికి కథలో అంతబలమైన కారణం ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది.
 • దీంతో పాటు ట్రైలర్లో అమలా పాల్, విజె రమ్య మధ్య ఉన్న ముద్దు సీన్ కూడా హాట్ టాపిక్ అయింది.
 • అమలా పాల్, విజె రమ్య ముద్దు ఎఫెక్టుతో ఈ చిత్రం లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ కాన్సెప్టుతో నడుస్తుందనే రూమర్లు కూడా తెరపైకి వచ్చాయి.
 • అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. సినిమాలో సబ్జెక్ట్ అది కాదు అని స్పష్టం చేశారు. ఈ మూవీ ద్వారా ఒక విభిన్నమైన కథను చెప్పబోతున్నట్లు తెలిపారు.
 • ఆమెను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి అంటున్న అమలా పాల్ అయితే రమ్యతో ముద్దు సీన్ గురించి అడిగిన ప్రశ్నకు అమలా పాల్ రియాక్ట్ అవుతూ... ‘ఒక మహిళ మరో మహిళను ముద్దాడితే తప్పేంటి? అది యాదృచ్ఛిక వచ్చిన షాట్... స్క్రిప్టులో కావాలని రాసిన సీన్ కాదు అన్నారు.
 • మా ఇద్దరి మధ్య సినిమాలో ఎలాంటి సెక్సువల్ రిలేషన్ ఉండదు. ఆ సీన్ అలా ఎందుకు ఉందో సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుందని తెలిపారు.
 • సినిమాలో నగ్నంగా నటించడానికి కారణం స్క్రిప్టు డిమాండ్ చేయడమే. కథలో చాలా కీలకమైన సీన్ అది. నాకు కన్విన్సింగ్‌గా ఉంది కాబట్టే చేయడానికి ఒప్పుకున్నాను. ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు.
 • సినిమా చూసిన ప్రేక్షకులు సైతం అంగీకరించే విధంగా కథ ఉంటుందని అమలా పాల్ తెలిపారు.
 • ఆమె ‘ఆడై' చిత్రం తెలుగులో ‘ఆమె' పేరుతో విడుదల కాబోతోంది. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 'వి స్టూడియోస్' సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జులై 19న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Amala Paul, VJ Ramya

Comments

Popular posts from this blog

మహేష్‌ మూవీ నుంచి జగపతి బాబు అవుట్‌?

తమన్నా ప్లేస్‌లో అవికా గోర్‌!