లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో కూతురు.. జనాలు చూడడంతో పరుగులు




 • బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది.
 • ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసిన ఈ అమ్మడు భారీ విజయాలను సొంతం చేసుకుంది.
 • తొలి సినిమా 'కేదార్‌నాథ్'తోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు అందుకున్న ఈ అమ్మడు.. తర్వాత 'టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన 'సింబా'లో నటించి మెప్పించింది.
 • తాజాగా తన వ్యవహార శైలితో బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది ఈ స్టార్ హీరో కూతురు.

 • సారా అలీ ఖాన్.. కార్తీక్ ఆర్యన్ అనే హీరోతో డేటింగ్‌లో ఉంది. వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు.
 • ఈ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు.. బయట కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్లు ఈ మధ్య పలుమార్లు కెమెరాల కంటికి కూడా చిక్కడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ వార్త బీ టౌన్‌లో హాట్ టాపిక్
 • సారా అలీ ఖాన్.. కార్తీక్‌తో డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆమె కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోంది.

 • సారా నాలుగు రోజుల క్రితం కార్తీక్‌ను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసింది.
 • అదే సమయంలో మరో కారులో ఆమె సోదరుడు, తల్లి కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
 • దీంతో కెమెరామెన్లు వారి ఫొటోలను తీశారు.
 • ఇవి బయటకు రావడంతో కుటుంబానికి తెలిసే సారా ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరుగుతోంది.

 • సారా అలీ ఖాన్ ఎయిర్‌పోర్టులో చేసిన ఓ పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
 • లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె.. అటు ఇటు చూసుకుంటూ పరిగెత్తింది.
 • దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
 • దీంతో సారా అలీ ఖాన్ మరోసారి బీ టౌన్‌లో చర్చనీయాంశం అయింది.

 • 2009లో సైఫ్ అలీ ఖాన్ - దీపికా పదుకునే కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్'. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
 • దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో సారా అలీ ఖాన్ - కార్తీక్ ఆర్యన్ జంటగా నటిస్తున్నారు.
 • ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా 2020 ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


Sara Ali Khan, Kartik Aaryan

Comments

Popular posts from this blog

మహేష్‌ మూవీ నుంచి జగపతి బాబు అవుట్‌?

తమన్నా ప్లేస్‌లో అవికా గోర్‌!

మరో మహిళతో ముద్దు సీన్... సమర్దించుకున్న అమలా పాల్!